- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
childbirth: ప్రసవం అనంతరం శిశువు బొడ్డుతాడు రాలిపోయే వరకు పాటించాల్సిన జాగ్రత్తలు..?
ప్రసవం (childbirth) తర్వాత బిడ్డకు ఉండే బొడ్డు తాడు(Umbilical cord)ను జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు (Experts) సూచిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రసవం (childbirth) తర్వాత బిడ్డకు ఉండే బొడ్డు తాడు(Umbilical cord)ను జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు (Experts) సూచిస్తున్నారు. బిడ్డ ఆరోగ్యం(Child health)గా ఉండాలంటే, బొడ్డు తాడు దగ్గర ఇన్ఫెక్షన్లు (Infections) రాకుండా చూసుకోవాలి. బిడ్డ పుట్టిన తర్వాత బొడ్డు తాడు 5 నుంచి 10 రోజుల వరకు ఉంటుందన్న విషయం తెలిసిందే. బొడ్డు తాడును కత్తిరించిన అనంతరం మొద్దును శుభ్రంగా పొడిగా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. ఒకటి లేదా రెండు వారాల్లో స్టంప్ దానంతటదే రాలిపోతుందని..
బొడ్డు తాడులో ఉండే రక్తంలో స్టెమ్ సెల్స్ (Stem cells) ఉంటాయని అంటున్నారు నిపుణులు. ఈ కణాలు ఎముక మజ్జ కణాలు(Bone marrow cells), రక్త కణాలు (Blood cells) లేదా మెదడు కణాలు (Brain cells) వంటి అనేక రకాలైన కణాలుగా పెరిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు.
అలాగే బొడ్డు తాడు భాగానికి ఎప్పుడూ కూడా పొడిగా, కాస్త గాలి తగిలేలా ఉండేలా చూసుకోవాలి. అలాగే బిడ్డకు డైపర్ (Diaper) ధరిస్తున్నప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. మావిపై సోప్ వాడటం మానుకోండి. లేకపోతే మావి వద్ద బిడ్డకు చికాకు పెడుతుంది. మొత్తం బొడ్డుతాడు రాలిపోయాక కూడా స్నానం చేయించకపోవడం బెటర్. వారం రోజుల పాటు తడిగుడ్డతో శీరీరాన్ని తుడవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే శిశువును కూడా తాకే ముందు చేతులు తప్పకుండా కడుక్కోవాలి. అప్పుడు పుట్టిన పిల్లల బాడీలు సున్నితంగా ఉంటాయి కాబట్టి తమ ఇమ్యూనిటి పవర్ (Immunity power) కూడా తగ్గిపోతుంది. బ్యాక్టిరియా, అంటువ్యాధులు, వైరస్ వంటివి తలెత్తుతాయి.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.






