- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాత్రూం నుండి లాక్కొచ్చి ముందస్తు అరెస్ట్..
దిశ, నాగర్‌కర్నూల్: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బాగంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు latest telugu news..

దిశ, నాగర్‌కర్నూల్: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బాగంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు.. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వారణాసి శ్రీనివాస్‌ను బాత్రూం లోనుండే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ స్టేషన్‌లో తనతోపాటు 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకొచ్చారు. ఇళ్లలోకి దూరి ఉన్నఫలంగా లాక్కొచ్చారని శ్రీనివాసులు తెలిపారు.
శాసనసభలో ప్రతిపక్షాలకు జరిగిన అవమానానికి నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిరసన తెలపాలని ఆదేశించారు. అయితే ఈ రోజు సీఎం వనపర్తి జిల్లా పర్యటన ఉన్న నేపథ్యంలో పోలీసులు బీజేపీ, కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. కానీ కుటుంబ సభ్యులు ఆందోళన పడేలా ఉన్న ఫలంగా ఎలా ఉంటే అలా లాక్కురావడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మాభిమానం దెబ్బతినేలా పోలీసులు ప్రవర్తించిన తీరును నిరసిస్తూ.. పోలీస్ స్టేషన్ లో అర్ధ నగ్నంగా నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు.






