పతకాల వీరుడు ప్రమోద్ భగత్.. టోర్నీలో మెరుగైన ప్రదర్శన

by Disha Web |
పతకాల వీరుడు ప్రమోద్ భగత్.. టోర్నీలో మెరుగైన ప్రదర్శన
X

కార్టాజెనా: స్పానిష్ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో భారత ఆటగాడు ప్రమోద్ భగత్ పతకాల పంట పండించాడు. ప్రపంచ నంబర్ వన్‌గా కొనసాగుతున్న ప్రమోద్ స్పానిష్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్-2022 పోటీల్లో ఏకంగా రెండు సిల్వర్, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఇక వరల్డ్ నంబర్ 2గా కొనసాగుతున్న సుకాంత్ కదమ్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. పద్మశ్రీ అవార్డు గ్రహిత ప్రమోద్ ఇంగ్లాండ్ ఆటగాడు డానియెల్ బెతెల్‌తో 39 నిమిషాలపాటు జరిగిన పోరాటంలో 9-21,13-21 స్కోర్‌ తేడాతో ఓటమి పాలై తృటిలో బంగారు పతకాన్ని చేజార్చుకున్నాడు. అంతకుముందు మిక్స్‌డ్ డబ్సుల్స్‌లో ప్రమోద్ భగత్, పలక్ కోహ్లీ జోడి ఇండియన్ జోడి అయిన రుతిక్ రఘుపతి, మానసి గిరిష్ చంద్ర జోషి చేతిలో 17-21,17-21 స్కోర్ తేడాతో ఓటమి పాలై కాంస్యంతో సరిపెట్టుకున్నారు.
Next Story

Most Viewed