విస్కీ విడవనంటున్నPragya Jaiswal.. తాగుబోతు బ్యాచ్ అంటున్న నెటిజన్లు

by Dishanational2 |
విస్కీ విడవనంటున్నPragya Jaiswal.. తాగుబోతు బ్యాచ్ అంటున్న నెటిజన్లు
X

దిశ, ఫీచర్స్ : టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ 'అఖండ' సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే తనకు ఆఫర్లు క్యూ కడుతున్నట్లు తెలుస్తుండగా.. మరోవైపు వాణిజ్య ప్రకటనల్లోనూ మెరుస్తోంది ప్రగ్య. తాజాగా 'జిమ్ భీమ్' ఆల్కహాల్ బ్రాండ్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నటి.. బ్లాక్ నైటీలో దర్శనమిచ్చి కుర్రాళ్లకు విస్కీతో పాటు హస్కీ చూపులతో మత్తెక్కించింది. తన ముందు విస్కీ బాటిల్‌ పెట్టుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'వరల్డ్ నంబర్ 1 బోర్బన్‌‌తో కొలాబరేషన్‌ను ఇష్టపడుతున్నా. బాధ్యతాయుతంగా తాగండి. 25 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే' అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పిక్స్‌పై రొమాంటిక్ కామెంట్లతో రెచ్చిపోతున్న నెటిజన్లు.. 'మత్తెక్కించే రెండు విషయాలు పక్క పక్కనే ఉన్నాయి. కానీ మాకు మాత్రం ఒకటే హైలైట్ అవుతుంది' అంటున్నారు. 'ప్రగ్యా! నిన్నిలా చూస్తే.. మాకు అన్ని భాగ్యాలు దక్కినట్లేనని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే 'అయినా మీదంతా తాగుబోతు బ్యాచ్ కదా' అని పరువు తీస్తున్నారు.

Next Story

Most Viewed