- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabhas: నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన ప్రభాస్ ఫేక్ ఫొటో
దిశ, సినిమా: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఈశ్వర్’(Eshwar) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. నేడు పాన్ ఇండియా స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగాడు. ఇక రీసెంట్‌గా వచ్చిన ‘కల్కీ2898ఏడీ’(Kalki 2898D) మూవీతో భారీ బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ‘కల్కీ 2’(Kalki 2), ‘సలార్ 2’(Salar 2), ‘రాజా సాబ్’(Raja Saab), ‘ఫౌజీ’(Fouji), ‘స్పిరిట్’(Spirit) వంటి సినిమాలతో తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నడుస్తోంది.
తాజాగా డార్లింగ్‌కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ప్రభాస్ బట్టతలతో దర్శనమిచ్చాడు. అంతే కాకుండా కళ్లజోడు పెట్టుకుని బ్లాక్ టీ షర్ట్‌లో షాకింగ్ లుక్‌లో కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్ నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. డార్లింగ్ ఫ్యాన్స్ ఇది ఫేక్ ఫొటో అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది ఫేక్ ఫొటో అని స్పష్టంగా అర్థం అవుతుంది. గత కొన్నాళ్లుగా ఆకతాయిలు ప్రభాస్ ఫొటో మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై ప్రభాస్ టీం సీరియస్‌గా స్పందించింది. ఇలాంటి ఫేక్ ఫొటోలను వైరల్ చేస్తే క్రిమినల్ చర్యలకు వెనకాడబోమని, వెంటనే సోషల్ మీడియాల నుంచి తొలగించాలని హెచ్చరించారు. అభిమానులు ఎవరూ వైరల్ అవుతున్న ఫేక్ ఫొటోని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.