డిప్యూటీ CM భట్టిని కలిసిన పవర్ ఎంప్లాయీస్ JAC

by Gantepaka Srikanth |

విద్యుత్ డిస్కంలలో జనరల్ ట్రాన్స్ఫర్స్‌కి సంబంధించి మేనేజ్మెంట్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై పవర్ ఎంప్లాయిస్ జేఏసీ అసంతృప్తిని వ్యక్తం చేసింది.

డిప్యూటీ CM భట్టిని కలిసిన పవర్ ఎంప్లాయీస్ JAC
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ డిస్కంలలో జనరల్ ట్రాన్స్ఫర్స్‌కి సంబంధించి మేనేజ్మెంట్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై పవర్ ఎంప్లాయిస్ జేఏసీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రజా భవన్‌లో ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కలిసి సమస్యలపై పవర్ ఎంప్లాయిస్ జేఏసీ విన్నవించింది. జనరల్ ట్రాన్స్‌ఫర్స్ మే లేదా జూన్ నెలలో చేయాలని, ఆర్టిజన్లకు గ్రేడ్ అప్గ్రేడేషన్ చేయాలని, డిస్కం సీఎండీలకు, విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి డిసెంబర్ 30 రిప్రజెంటేషన్ అందజేసినట్లు జేఏసీ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్ళారు. అయినప్పటికీ డిస్కం మేనేజ్మెంట్ జనవరి 20వ తేదీన జనరల్ ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలని నిర్ణయించి గైడ్లైన్స్ ఏకపక్షంగా ఇచ్చారని తెలిపారు. ఈ విషయంలో జేఏసీ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. జనరల్ ట్రాన్స్ఫర్స్ విషయంలో జేఏసీల యొక్క ఒపీనియన్‌ను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించి జనరల్ ట్రాన్స్ఫర్ విషయంలో యాజమాన్యంతో మాట్లాడి ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు జేఏసీ సభ్యులు తెలిపారు. డిప్యూటీ సీఎం కలిసిన వారిలో జీఏసీ ఛైర్మన్ సాయిబాబు, కో చైర్మన్ రత్నాకర్ రావు, తాజుద్దీన్ బాబా, మేడి రమేష్, భూపాల్ రెడ్డి, పవన్, మహేష్ ఉన్నారు.

Next Story