- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు వర్సిటీ స్నాతకోత్సవ పట్టాకు దరఖాస్తు గడువు పెంపు
by Manoj |
దిశ, ప్రతినిధి, హైదరాబాద్ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం..latest telugu news

X
దిశ, ప్రతినిధి, హైదరాబాద్ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ పట్టాకు దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సీ. మురళీ కృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవాన్ని ఏప్రిల్ నెలలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్నాతకోత్సవంలో పట్టాలు పొందాలనుకునే విద్యార్థులు తమ దరఖాస్తులు సమర్పించేందుకు వీలుగా ఏప్రిల్ 11వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు వెల్లడించారు. ఇతర వివరాలకు www.teluguuniversity.ac.in వెబ్ సైట్ లో చూడవచ్చని ఆయన పేర్కొన్నారు.
Next Story






