చైనా మాంజా మెడకు చుట్టుకొని పోస్ట్‌మాన్‌కు తీవ్ర గాయాలు

by Muthe.Rajitha |

చైనా మాంజా మరొకరి ప్రాణాల మీదకి తెచ్చింది.

చైనా మాంజా మెడకు చుట్టుకొని పోస్ట్‌మాన్‌కు తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : చైనా మాంజా మరొకరి ప్రాణాల మీదకి తెచ్చింది. మాంజా దారం గొంతుకు చుట్టుకుని ఒక పోస్ట్‌మాన్‌కు తీవ్ర గాయాలైన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండలో జరిగింది. ఉద్యోగరీత్యా డ్రైవర్‌పేటలో లెటర్స్ ఇవ్వడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పోస్ట్‌మాన్ గోపీకి రోడ్డుపై వేలాడుతున్న చైనా మాంజా గొంతుకు చుట్టుకుని తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు అతడిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా, అక్కడ చికిత్స అనంతరం 108 వాహనంలో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో చైనా మాంజా అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేసారు.

Next Story