దసరా మూవీ.. ఊహించని క్యారెక్టర్‌లో పూర్ణ

by Disha Web Desk |
దసరా మూవీ.. ఊహించని క్యారెక్టర్‌లో పూర్ణ
X

దిశ, సినిమా : 'అంటే సుందరానికీ' మూవీతో సక్సెస్ అందుకున్న నాని.. తదుపరి సినిమాలో మాస్ లుక్‌లో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న 'దసరా' చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిందని స్ప్రెడ్ అవుతున్న రూమర్స్‌కు తాజాగా చిత్ర యూనిట్ చెక్ పెట్టింది. హైదరాబాద్‌‌లో వేసిన భారీ సెట్‌లో షూటింగ్‌‌ను మళ్లీ ప్రారంభించారు. ఇక్కడే భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు ఓ పాటను కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తుండగా.. కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్‌ ఆధ్వర్యంలో 500 మంది డ్యాన్సర్లు పాల్గొన్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన మరొక అప్‌డేట్ రివీల్ చేశారు మేకర్స్. 'అఖండ' మూవీలో కీలక పాత్రలో కనిపించిన హీరోయిన్ పూర్ణ.. 'దసరా' మూవీలో నెగెటివ్ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన లుక్‌ కూడా రివీల్ చేశారు. పొడవాటి కర్లీ హెయిర్‌తో కూడిన తన ఇంటెన్స్ లుక్ పవర్‌ఫుల్‌గా ఉంది. ఇక తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్న చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్ అందించారు.

Next Story