- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డికి నిరుపేద వర్గాలు అంటే కక్ష: జీవన్ రెడ్డి
ఫీజు రియంబర్స్మెంట్ నిధుల చెల్లింపు విధానంపై సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన బీఆర్‌ఎస్ నేత జీవన్ రెడ్డి. నిరుపేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరుపేద వర్గాలు అంటే ఎందుకు కక్ష అని, రాజ్యాంగ నిబంధనలు పాటించడం నీ బాధ్యత కదా, విద్యా,వైద్యం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు అని బీఆర్ఎస్ప్రధాన కార్యదర్శి టి. జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్ధిక వెనకబాటు తనంలో ఉన్న విద్యార్థులకు అండగా ఉండేందుకు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారని దాని ఎందుకు కొనసాగించడం లేదని నిలదీశారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ నుండి పోస్ట్ మెట్రిక్ చదివే వారికి లక్షలాది మంది విద్యార్థులకు బోధన కోసం ఈ పథకం ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ పథకం మరింత పటిష్టంగా అమలు జరిగిందన్నారు.
2023 ఎన్నికల సమయంలో ప్రభుత్వం రైతు భరోసా తాము పెంచి ఇస్తామని గొప్పలు చెప్పారని ఇప్పుడు ఏమవుతుందో అందరికీ తెలుసు అంటూ ఎద్దేవా చేశారు. విద్యా పూర్తి అయినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్ లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. చివరికి కళాశాల యాజమాన్యం కోర్టుకు వెళ్ళాయని, బకాయిలు వసూలు కోసం యాజమాన్యలకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసుకోవాలి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఆర్థిక భారం లేకుండా కళాశాలలో చదివే వారని, తాము నేరుగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం జివో ఇచ్చింది. ఇది సరైన విధానం కాదని, డైరెక్ట్ గా కళాశాలకు చెల్లించే స్తోమత లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మీద కోపం ఉంటే ఈ పథకం ప్రారంభం చేసింది వైఎస్సార్ ఆయన కోసం కొనసాగించాలని సూచించారు.
కేసీఆర్వైద్యం కు సంబంధించి కూడా ఆరోగ్య శ్రీ మరింత పటిష్టం చేశాడని రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 జిల్లాలు ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో వైద్య విద్యా కళాశాల ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ప్రభుత్వం గత పాలన కంటే మెరుగైన పాలన కొనసాగించాలని, కానీ రేవంత్‌రెడ్డి కి సాధ్యం కాదన్నారు. రైతు భరోసా రెండు దఫాలు, రుణమాఫీ రూ. 2 లక్షల లోపు చేస్తానని ఎగ్గొట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫోర్త్ సిటీ, హైడ్రా తప్ప ఇంకోటి కనిపించదని, జీవో 7ను వెంటనే ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రంలో రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. 1994 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతి వచ్చే ఎన్నికల్లో పడుతుందని అనాడు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నారు.






