Poonam Pandey: నన్ను డబ్బులు సంపాదించే మెషిన్‌గానే భావించారు.. హాట్ బ్యూటీ

by Manoj |   (  Updated:2022-04-15 13:20:20  IST  )

దిశ, సినిమా : కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'లాక్ అప్' షో.. సంచలన కామెంట్స్‌తో అందరి దృష్టిని..latest telugu news

Poonam Pandey: నన్ను డబ్బులు సంపాదించే మెషిన్‌గానే భావించారు.. హాట్ బ్యూటీ
X

దిశ, సినిమా : కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'లాక్ అప్' షో.. సంచలన కామెంట్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కంటెస్టెంట్స్ బయటపెడుతున్న ప్రొఫెషనల్, పర్సనల్ మ్యాటర్స్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో షో మొదటి నుంచి హల్ చల్ చేస్తున్న పూనమ్ పాండే.. తాజా ఎపిసోడ్‌లో మరోసారి తన కష్టాల గురించి చెబుతూ కన్నీటి పర్యంతమైంది. నాలుగేళ్ల క్రితం తన ఫ్యామిలీలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్న పూనమ్.. కుటుంబ సభ్యులే తనని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని చెప్పింది. అయితే ఎందుకలా చేశారో చెప్పలేదన్న నటి.. తనను కేవలం డబ్బు సంపాదించే మెషిన్‌గానే భావించారంటూ భావోద్వేగానికి లోనైంది. ఇక తానెప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదని, సొంత పనుల్లోనే బిజీగా ఉండేదానినని తెలిపింది. తన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడే ముందు నిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలంటూ ఏడ్చేసింది. చివరగా ఎవరేమనుకున్నా గాని తాను తనలాగే ఉంటానని తెగేసి చెప్పింది.

Next Story