- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ గ్రహం మీద హాటెస్ట్ మదర్ నువ్వే!.. లిసాపై బుట్టబొమ్మ ప్రశంసలు
by S Gopi |
దిశ, సినిమా : ప్రముఖ మోడల్ అండ్ యాక్ట్రెస్ లిసా హెడెన్ సముద్రంలో విన్యాసాలు చేస్తూ ఆకట్టుకుంటోంది.

X
దిశ, సినిమా : ప్రముఖ మోడల్ అండ్ యాక్ట్రెస్ లిసా హెడెన్ సముద్రంలో విన్యాసాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లిన నటి.. తాజాగా బాలిలో సర్ఫింగ్ చేస్తున్న ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. అంతేకాదు అలలు ఒక్కసారిగా దూసుకురావడంతో భయపడ్డానని, అయినప్పటికీ వాటిని ఎదుర్కొని విన్యాసాన్ని కొనసాగించినందుకు ఊహించని రీతిలో అభినందనలు వెల్లువెత్తాయని నోట్‌లో ప్రస్తావించింది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ పోస్టుపై స్పందించిన పూజా హెగ్డే.. లిసా ఫిట్‌నెస్‌కు ఫిదా అయినట్లు తెలిపింది. ముగ్గురు పిల్లలకు తల్లయినా తనలో పవర్ తగ్గలేదంటూ పొగడ్తలతో ముంచెత్తిన నటి.. 'ఈ గ్రహం మీద హాటెస్ట్ మదర్ నువ్వే!' అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. ఈ మేరకు అభిమానులకు కూడా 'ప్రపంచంలో అత్యంత అందమైన మహిళ' అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Next Story






