- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో వాట్సప్ గ్రూపులపై నిఘా పెట్టిన పోలీసులు
హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న 'కంట్రోల్ రూమ్', 'న్యూసెన్స్' అనే రెండు వాట్సాప్ గ్రూపులపై తెలంగాణ సైబర్ క్రైమ్ బ్రాంచ్, హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తమ విచారణను మరింత తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ కేంద్రాన్ని బేస్ చేసుకుని నడుస్తున్న 'కంట్రోల్ రూమ్' (Control Room), 'న్యూసెన్స్' (NewSense) అనే రెండు ప్రముఖ వాట్సాప్ గ్రూపులపై తెలంగాణ సైబర్ క్రైమ్ బ్రాంచ్, హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గతంలో అక్రమంగా సేకరించిన ఫోన్ ట్యాపింగ్ డేటా, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల వ్యక్తిగత వివరాలు, వారి ప్రయాణాలు, సంభాషణలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఈ రెండు వాట్సాప్ గ్రూపులలో కొందరు వ్యక్తులు షేర్ చేసినట్లు అధికారులు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. ఈ వ్యవహారంలో కీలక లింకులను కనుగొనేందుకు సిట్ అధికారులు 'కంట్రోల్ రూమ్' గ్రూప్ అడ్మిన్ రమేష్ వైట్ల, అలాగే 'న్యూసెన్స్' గ్రూప్ అడ్మిన్ ఆకులు శ్యామ్ సుందర్‌లను ఇప్పటికే విడివిడిగా పిలిపించి సుదీర్ఘంగా విచారించారు.
ఈ గ్రూపుల్లోని సభ్యుల వివరాలు, వారు పంచుకున్న డేటా యొక్క మూలాలపై సమాచారాన్ని సేకరించారు. గ్రూప్ అడ్మిన్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా, ఆయా గ్రూపుల్లో చురుగ్గా ఉంటూ సమాచారాన్ని చేరవేసిన మరికొంత మంది కీలక సభ్యులను కూడా త్వరలోనే విచారణకు పిలవాలని పోలీసులు నిర్ణయించారు. వీరందరిపై ప్రస్తుతం అంతర్గత నిఘా ఉంచారు. ఈ కేసు అత్యంత సున్నితమైనది కావడం, రాజకీయ, అధికార వర్గాలకు సంబంధించిన డేటాతో ముడిపడి ఉండటంతో.. పోలీసులు కానీ, సిట్ ఉన్నతాధికారులు కానీ ఈ దర్యాప్తుకు సంబంధించిన ఎలాంటి వివరాలను అధికారికంగా బయటకు రాకుండా పూర్తి గోప్యత పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.






