- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ విక్రయాలపై పోలీసుల పంజా
హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా గుట్టురట్టు! క్లబ్ సెక్రటరీలకు కేటాయించిన టికెట్లను భారీ ధరలకు విక్రయిస్తున్న ముఠాను మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం భారతదేశంలో ఐపీఎల్ (IPL) హంగామా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిని ఆసరాగా చేసుకున్న దుండగులు.. ఐపీఎల్ టికెట్లను బ్లాక్‌లో భారీ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ బ్లాక్ వికెట్ల దందాపై హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) పంజా విసిరారు. పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగి. మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ (SOT) పోలీసులు బట్టబయలు చేశారు. ఈ టికెట్ల విక్రయ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్రికెట్ క్లబ్‌ల సెక్రటరీలకు కేటాయించిన అధికారిక టికెట్లు అక్రమ పద్ధతిలో బ్లాక్ మార్కెట్‌కు మళ్లుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ముఖ్యంగా ఒక్కో క్లబ్ సెక్రటరీకి 17 టికెట్ల చొప్పున కేటాయింపులు జరగగా, వాటిని సాధారణ ధరల కంటే భారీ రేట్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో క్లబ్ సెక్రటరీల హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐపీఎల్ క్రేజ్‌ను అడ్డుపెట్టుకుని సామాన్య అభిమానులను దోచుకుంటున్న ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.






