- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.26 వేలకే కారు అంటూ ఇన్‌స్టాలో పోస్ట్.. వ్యాపారి రోషన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రకటనలు ఒక్కోసారి ఎంతటి ఉద్రిక్తతలకు దారితీస్తాయో చెప్పడానికి మేడ్చల్ జిల్లాలో జరిగిన ఓ ఘటన సాక్ష్యంగా నిలిచింది.

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రకటనలు ఒక్కోసారి ఎంతటి ఉద్రిక్తతలకు దారితీస్తాయో చెప్పడానికి మేడ్చల్ (Medchal) జిల్లాలో జరిగిన ఓ ఘటన సాక్ష్యంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. మల్లాపూర్ (Mallapur)కు చెందిన రోషన్ (Roshan) అనే పాత కార్ల వ్యాపారి, తన వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆకర్షణీయమైన ప్రకటన ఇచ్చాడు. జస్ట్ రూ.26 వేలకే కారు అమ్ముతానని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా, ఈ ప్రకటన కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.
అయితే, అతి తక్కువ ధరకే కారు దొరుకుతుందన్న ఆశతో పరిసర ప్రాంతాల ప్రజలు, యువకులు భారీ సంఖ్యలో తెల్లవారుజామునే రోషన్ షోరూం వద్దకు చేరుకున్నారు. వందలాది మంది ఒక్కసారిగా రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. తీరా షాపు తెరిచిన తర్వాత కార్ల గురించి అడగ్గా, ‘కార్లు లేవు’ అని వ్యాపారి సమాధానం ఇచ్చాడు. వ్యాపారి మాటలతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రజలు తాము మోసపోయామని గ్రహించారు. గంటల తరబడి వేచి చూసిన తమను రోషన్ తప్పుదోవ పట్టించాడంటూ అక్కడున్న కార్లపై రాళ్లతో దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు (Police) అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రోషన్‌పై కేసు నమోదు చేసి, అతడిని నాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.






