- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌కు ప్రధాని మోడీ.. ఈ ప్రాంతాల్లో డ్రోన్లపై నిషేధం విధిస్తూ సీపీ ఉత్తర్వులు
మే 10న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో మాదాపూర్ పరిధిలో డ్రోన్లపై సైబరాబాద్ పోలీసులు నిషేధం విధించారు. హైటెక్ సిటీలో సింధు హాస్పిటల్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ఈ నెల 10న (ఆదివారం) హైదరాబాద్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా హైటెక్ సిటీలో నూతనంగా నిర్మించిన 'సింధు హాస్పిటల్' (Sindhu Hospital) ను ఆయన ప్రారంభించనున్నారు. ప్రధాని రాకను పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లు, పారా-గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో-లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఎగురవేతపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ నిషేధం విధించారు. ఈ నిషేధాజ్ఞలు మే 10వ తేదీ రోజంతా అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. కమిషనర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లు, ఏసీపీ, డీసీపీ కార్యాలయాల నోటీసు బోర్డులపై సమాచారాన్ని పొందుపరిచారు.






