సంగీత లోకంలో ఆందోళన.. ఆశా భోంస్లే కోలుకోవాలని ప్రధాని మోడీ ప్రార్థన

by Malleboina Mahesh |

ఆశా భోంస్లే త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ప్రార్థన. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లెజెండరీ సింగర్.. ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి.

సంగీత లోకంలో ఆందోళన.. ఆశా భోంస్లే కోలుకోవాలని ప్రధాని మోడీ ప్రార్థన
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయ సంగీత లెజెండ్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఆశా భోంస్లే (92) ఆసుపత్రిలో చేరడం దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను ఆందోళనకు గురి చేసింది. వయోభారం సమస్యల కారణంగా ఆమె ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్తపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ.. ఆశా భోంస్లే త్వరగా కోలుకోవాలని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆకాంక్షించారు. "ఆశా భోంస్లే ఆసుపత్రిలో చేరారని తెలిసి తీవ్ర ఆందోళన చెందాను. ఆమె సంపూర్ణ ఆరోగ్యం తో, త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమె త్వరలోనే కోలుకుని డిశ్చార్జ్ అవుతారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడు దశాబ్దాలుగా తన గాత్రంతో కోట్ల మందిని అలరించిన ఆమె క్షేమంగా తిరిగి రావాలని సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థనలు చేస్తున్నారు.

Next Story