- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ మెట్రోకు మహర్దశ: ₹18,300 కోట్లతో కొత్త కారిడార్లు
ఢిల్లీలో ₹18,300 కోట్ల మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ. పింక్, మెజెంటా లైన్లలో కొత్త కారిడార్ల వల్ల పలు ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ.

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సుమారు ₹18,300 కోట్ల విలువైన మెట్రో ప్రాజెక్టుల (Metro project)కు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ మెట్రోలో రెండు కొత్త కారిడార్లను ఆయన జాతికి అంకితం చేశారు. ఇందులో సుమారు 12.3 కిలోమీటర్ల పొడవున్న మజ్లిస్ పార్క్ - మౌజ్‌పూర్ బాబర్‌పూర్ (పింక్ లైన్) కారిడార్‌తో పాటు, 9.9 కిలోమీటర్ల పొడవైన దీపాలీ చౌక్ - మజ్లిస్ పార్క్ (మెజెంటా లైన్) కారిడార్‌లు అందుబాటులోకి వచ్చాయి. రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేశారు.
ఈ నూతన మెట్రో మార్గాల వల్ల ఢిల్లీలోని బురారీ, జగత్‌పూర్-వజీరాబాద్, ఖజూరి ఖాస్, భజన్‌పురా, యమునా విహార్, మధుబన్ చౌక్ వంటి అనేక కీలక ప్రాంతాల ప్రజలకు గొప్ప ఊరట లభించనుంది. అంతేకాకుండా హైదర్‌పూర్ బాద్లీ మోర్, భల్వాస్వా- మజ్లిస్ పార్క్ వంటి ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడటంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. రాజధాని నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం తో పాటు పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాలను పెంపొందించడంలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.






