- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ హర్షం
భారత రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు.

దిశ, వెబ్ డెస్క్: భారత రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని, దేశాభివృద్ధి ప్రయాణంలో ఇది కీలకమైన మైలురాయి అని ఆయన అభివర్ణించారు. ప్రధాని తన ట్వీట్‌లో "రాష్ట్రపతి ప్రసంగం సమగ్రంగా, అత్యంత లోతైన విశ్లేషణ తో కూడి ఉంది. గత కొన్నేళ్లుగా భారత్ సాధించిన అద్భుతమైన ప్రగతిని ప్రతిబింబించడమే కాకుండా, భవిష్యత్తుకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. 'వికసిత భారత్' నిర్మాణంలో మనందరి సమిష్టి సంకల్పాన్ని ఆమె మాటలు అద్దం పట్టాయి" అని ప్రధాని పేర్కొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం
అలాగే భారత ప్రభుత్వ విధానాలు, సంస్కరణల గురించి ప్రస్తావిస్తూ.. "రైతులు, యువత, మహిళలు, పేద వర్గాల సాధికారత కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ ప్రసంగం ఎత్తిచూపింది. 'రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్' (సంస్కరణల వేగం) మరింత పుంజుకుంటుందని, సుపరిపాలన, నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని" ప్రధాని పునరుద్ఘాటించారు. బలోపేతమైన, స్వయం సమృద్ధి గల భారతదేశాన్ని నిర్మించేందుకు ఈ ప్రసంగం ఒక బలమైన పునాది అని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు.






