- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యూఆర్ కోడ్‌తో కొత్త ఆధార్ కార్డులు.. క్లారిటీ ఇచ్చిన పీఐబీ
కొత్త ఆధార్ కార్డుల పేరుతో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం! ఇటువంటి వార్తలను నమ్మవద్దని ప్రజలకు PIB క్లారిటీ ఇచ్చింది. ఆధార్ డిజైన్ మార్పుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా ఆధార్ (Aadhaar) కార్డుల్లో భారీ మార్పులు చేయబోతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివరికల్లా ఆధార్ కార్డుల రూపం పూర్తిగా మారిపోనుందని, కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త కార్డులు అందుబాటులోకి వస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) తీవ్రంగా ఖండించింది. ఇటువంటి వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని, ప్రభుత్వం వద్ద ఆధార్ డిజైన్‌ను మార్చే ప్రతిపాదనలేవీ ప్రస్తుతం లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికగా కొంతమంది తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజల్లో అనవసర గందరగోళాన్ని సృష్టిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.
ఆధార్ కార్డులకు సంబంధించిన ఎలాంటి మార్పులైనా, అధికారిక నిర్ణయాలైనా కేవలం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI, PIB అధికారిక ఛానెల్స్ ద్వారా మాత్రమే వెలువడతాయని ప్రభుత్వం వివరించింది. ప్రజలు ఇటువంటి పుకార్లను నమ్మవద్దని, ఏదైనా అనుమానం ఉంటే అధికారిక వెబ్‌సైట్‌లను సంప్రదించాలని సూచించింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న ఆధార్ కార్డులే యధావిధిగా కొనసాగుతాయని, వాటిలో ఎలాంటి మార్పులు ఉండబోవని కేంద్రం తేల్చి చెప్పింది.






