- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ పే వాలెట్ వినియోగదారులకు అలర్ట్.. ప్రతి మూడు నెలలకు రూ. 100 ఛార్జ్ ఎందుకంటే..?
ఫోన్‌పే వాలెట్ వినియోగదారులకు హెచ్చరిక. ఏడాది పాటు వాడకుంటే ప్రతి మూడు నెలలకు రూ. 100 ఛార్జ్.. బ్యాంక్ ఖాతాలకు ఎలాంటి ముప్పు లేదు!

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ పే వాలేట్ వినియోగదారులకు రూ. 100 ఛార్జ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో ఫోన్ పే వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో అప్రమత్తం అయిన ఫోన్ పే సంస్థ కీలక ప్రకటన చేసింది. 'ఫోన్‌పే' (PhonePe) తమ వాలెట్ పాలసీని సవరిస్తూ ఇన్-యాక్టివ్ వాలెట్లపై త్రైమాసిక నిర్వహణ రుసుమును విధించనున్నట్లు ప్రకటించింది. ఒక ఫోన్‌పే వాలెట్ ద్వారా వరుసగా 365 రోజుల పాటు (ఒక సంవత్సరం) ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగకపోతే, దానిని ‘ఇన్-యాక్టివ్’ వాలెట్‌గా పరిగణిస్తారు.
అలా మారిన అకౌంట్లకు ప్రతి మూడు నెలలకు రూ. 100 చొప్పున (జీఎస్‌టీతో కలిపి) మేయింటెనెన్స్ ఫీజు విధిస్తారు. అయితే ఈ కొత్త నిబంధన కేవలం 'ఫోన్‌పే వాలెట్' అకౌంట్లకు మాత్రమే వర్తిస్తుందని, వినియోగదారుల సాధారణ బ్యాంక్ ఖాతాలకు లేదా వారు చేసే యూపీఐ (UPI) లావాదేవీలకు దీనితో ఎలాంటి సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది. యాప్‌ను కేవలం లాగిన్ చేసినా, నేరుగా బ్యాంక్ ద్వారా యూపీఐ పేమెంట్లు చేసినా దానిని వాలెట్ యాక్టివిటీగా పరిగణించరని కంపెనీ పేర్కొంది.
15 రోజుల ముందే హెచ్చరికలు
వాలెట్ ఇన్-యాక్టివ్ లిస్ట్‌లోకి వెళ్లే 15 రోజుల ముందే ఫోన్‌పే వినియోగదారులకు హెచ్చరిక సందేశాలు, నోటిఫికేషన్లను పంపుతుంది. ఆ గ్రేస్ పీరియడ్‌లో వాలెట్ బ్యాలెన్స్ ఉపయోగించి ఏదైనా ఒక చిన్న లావాదేవీ చేయడం ద్వారా దానిని మళ్లీ 'యాక్టివ్' స్థితికి తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఎలాంటి చర్య తీసుకోకపోతే, ఆ రూ. 100 ఛార్జీని నేరుగా మీ వాలెట్ బ్యాలెన్స్ నుండి మాత్రమే కట్ చేస్తారు.
ఒకవేళ వాలెట్‌లో రూ. 100 కంటే తక్కువ అమౌంట్ ఉంటే, ఉన్న మొత్తాన్ని మాత్రమే మినహాయించుకుని వాలెట్ బ్యాలెన్స్‌ను 'సున్నా' (Zero) చేస్తారు తప్ప, బ్యాలెన్స్ ఎప్పటికీ మైనస్‌లోకి (Negative) వెళ్లదని, మీ బ్యాంక్ ఖాతా నుండి ఎలాంటి సొమ్ము కట్ అవ్వదని ఫోన్‌పే స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. భవిష్యత్తులో వాలెట్ వాడే ఉద్దేశం లేని వారు అందులోని నిల్వలను ముందే బ్యాంక్ ఖాతాలోకి విత్‌డ్రా చేసుకోవడం ఉత్తమమని విశ్లేషకులు చెబుతున్నారు.






