- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు నోటీసులు.. రెచ్చిపోయిన కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు(Harish Rao)కు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. ‘బొగ్గుగనుల కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసును తీసుకొచ్చారు. మాకు చట్టంపై సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఏ విచారణకు హాజరు కావడానికైనా సిద్ధం. విచారణల పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేరు. ప్రభుత్వ చౌకబారు బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడం. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా పెట్టుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టే కొట్టివేసింది. అయినా నోటీసుల పేరుతో హడావిడి చేయడం రేవంత్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనం’ అని కేటీఆర్ రెచ్చిపోయారు. రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని హరీష్ రావుకు సిట్ పంపిన నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా హరీష్ రావుకు సిట్ నోటీసులు పంపించింది.






