- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Phone Tapping Case: కేటీఆర్‌కు సిట్ నోటీసులపై హరీష్ రావు స్పందన
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ ముఖ్యనేత, మాజీమంత్రి హరీష్ రావు స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ ముఖ్యనేత, మాజీమంత్రి హరీష్ రావు(Harish Rao) స్పందించారు. ప్రస్తుతం మెదక్ పర్యటనలో ఉన్న హరీష్ రావు.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘నిన్న నాకు నోటీసులు.. నేడు కేటీఆర్‌కు నోటీసులు.. బొగ్గు కుంభకోణంపై సమాధానం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతోంది. ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డా రేవంత్ రెడ్డి.. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా నీ వెంట పడుతూనే ఉంటాం.. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నిన్ను వదిలి పెట్టం. వెంటపడుతాం’ అని హరీష్ రావు హెచ్చరించారు. శుక్రవారం ఉ.11గంటలకు విచారణకు రావాలని కేటీఆర్‌కు సిట్ జారీ నోటీసుల్లో పేర్కొంది. జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణ ఉంటుందని.. సిట్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్‌కు 160 CRPC కింద నంది నగర్‌లోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు.
READ MORE ....






