- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లీటర్ పై రూ. 5 తగ్గించినా తగ్గని పెట్రోల్ మంట.. రూ. 410 కి చేరిన ధర
పాకిస్తాన్‌లో అంతర్జాతీయ చమురు సంక్షోభం కారణంగా పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 410 మార్కు వద్దే కొనసాగుతున్నాయి. నిన్నటి సవరణలో రూ. 5 తగ్గినా భారం తగ్గలేదు.

దిశ, వెబ్ డెస్క్: ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్తాన్‌ను అమెరికా, ఇరాన్ యుద్ధం కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇరాన్ యుద్ధ ప్రభావం కారణంగా పాకిస్తాన్‌లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. పశ్చిమాసియా దేశాలలో యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు బ్యారెల్‌కు 110 డాలర్ల పైకి చేరడం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో మే మొదటి వారంలో పాకిస్తాన్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ ధరను రూ. 14.92 మేర పెంచడంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర దేశ చరిత్రలోనే గరిష్ఠంగా రూ. 414.78 కు చేరింది.
అయితే అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా ప్రతి 15 రోజులకు ఒకసారి జరిగే సమీక్షలో భాగంగా.. తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చేలా పెట్రోల్, డీజిల్ ధరలపై లీటరుకు రూ. 5 మేర తగ్గించింది. ఈ రూ. 5 తగ్గింపు తర్వాత ప్రస్తుతం పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 409.78 (సుమారు రూ. 410) పలుకుతోంది. అలాగే హై-స్పీడ్ డీజిల్ ధర కూడా లీటరుకు రూ. 409.58 గా ఉంది. ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ.. రూ. 410 వద్ద ఇంధన ధరలు కొనసాగుతుండటంతో అక్కడ రవాణా ఖర్చులు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. దీనివల్ల పాకిస్తాన్‌లోని రావల్పిండి వంటి నగరాల్లో ఎలక్ట్రిక్ బైక్‌లకు (E-Bikes) డిమాండ్ భారీగా పెరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.






