కాంగ్రెస్ పార్టీ ధర్మసాగర్ మండల అధ్యక్షుడిగా పెసరు రమేష్

by Ratna Kumari |   (  Updated:2026-07-02 16:00:10  IST  )

ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పెసరు రమేష్‌ను కాంగ్రెస్ పార్టీ ధర్మసాగర్ మండల అధ్యక్షుడిగా నియమిస్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ధర్మసాగర్ మండల అధ్యక్షుడిగా పెసరు రమేష్
X

దిశ, ధర్మసాగర్ : ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పెసరు రమేష్‌ను కాంగ్రెస్ పార్టీ ధర్మసాగర్ మండల అధ్యక్షుడిగా నియమిస్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పెసరు రమేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన నియామకానికి సహకరించిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాం రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పార్టీ బలోపేతమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

మండలంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తానన్నారు. మండలంలోని అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ఐక్యంగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ పార్టీ అధిష్ఠానం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని పెసరు రమేష్ పేర్కొన్నారు.

Next Story