- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటిలో మునిగి వ్యక్తి మృతి
ప్రమాదవశాత్తూ చెరువులో నీటిలో మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని యూసుఫ్‌పేట గ్రామంలో చోటుచేసుకుంది.

దిశ, పాపన్నపేట: ప్రమాదవశాత్తూ చెరువులో నీటిలో మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని యూసుఫ్‌పేట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం యూసుఫ్‌పేట గ్రామానికి చెందిన నర్ర రాములు (48) వ్యవసాయంతో పాటు చేపలు పట్టి జీవనం సాగించేవాడు. ఈ నెల 18న చేపలు పట్టేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి, వలలు తీసుకుని గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లాడు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. చెరువు కట్ట పై అతని బట్టలు, చెప్పులు, మొబైల్ ఫోన్ కనిపించడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలింపు చేపట్టగా, రాత్రి సమయంలో రాములు మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సుశీల ఫిర్యాదు మేరకు శనివారం కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.






