రిలీజ్‌కు ముందే రచ్చ.. ‘పెద్ది’ సెన్సేషన్ రికార్డ్

by Mallepaka Hamsa |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) – దర్శకుడు బుచ్చిబాబు సనా (Buchi Babu Sana)కాంబోలో రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (peddi). రిలీజ్‌కు ముందే హాట్ టాపిక్‌గా మారింది.

రిలీజ్‌కు ముందే రచ్చ.. ‘పెద్ది’ సెన్సేషన్ రికార్డ్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) – దర్శకుడు బుచ్చిబాబు సనా (Buchi Babu Sana)కాంబోలో రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (peddi). రిలీజ్‌కు ముందే హాట్ టాపిక్‌గా మారింది. షూటింగ్ వేగంగా సాగుతుండగా, ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. రామ్ చరణ్‌ను ఇప్పటివరకు చూడని డిఫరెంట్ మాస్ అవతార్‌లో చూపించబోతున్నాడనే ప్రచారం సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, ప్రమోషనల్ కంటెంట్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అందులోనూ ‘చికిరి చికిరి’ పాట అయితే విడుదలైన కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. రిలీజ్‌కు ముందే ‘పెద్ది’ రచ్చ మొదలైంది. ఐదు భాషల్లో కలిపి ఈ పాట 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అలాగే మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా 60 మిలియన్లకు పైగా ఆడియో స్ట్రీమ్స్ నమోదు కావడం విశేషం.

ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికలపై ఈ పాట ట్రెండ్‌ను సెట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షలకుపైగా రీల్స్, యూట్యూబ్‌లో 8.7 లక్షలకుపైగా షార్ట్స్ ఈ పాట హుక్ స్టెప్‌తో రూపొందడం విశేషం. సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రేక్షకుల వరకు అందరూ ఈ పాటకు డాన్స్ చేస్తూ వీడియోలు షేర్ చేయడంతో ‘చికిరి చికిరి’ ఒక ట్రెండ్ సాంగ్‌గా మారిపోయింది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను రామ్ చరణ్ బర్త్ డే కాకుకగా.. మార్చి 27న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Next Story