పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. ఆ సినిమా వల్లే

by Disha Web Desk 2 |
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. ఆ సినిమా వల్లే
X

దిశ, సినిమా : క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. కాగా పలుమార్లు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ మూవీ షూటింగ్‌కు తాజాగా మరోసారి బ్రేక్ పడింది. ఇన్నాళ్లు పవన్ పాలిటిక్స్‌లో బిజీగా ఉండటం ఇందుకు కారణమైతే.. ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగష్టు 1 నుంచి షూటింగ్స్ అన్ని నిలిపివేయాలని నిర్ణయించడం మరో కారణం. ఇక 65శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఆగిపోవడంతో.. పవన్ ఫ్యాన్స్‌లో నిరాశ మొదలైంది.


Next Story

Most Viewed