ఆ ఒక్కటి తప్ప ఏదైనా అడగమని చెప్పాను.. పవన్ కల్యాణ్

by Javid Pasha |

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల ఫ్రెండ్‌షిప్ గురించి.. Latest Telugu News..

ఆ ఒక్కటి తప్ప ఏదైనా అడగమని చెప్పాను.. పవన్ కల్యాణ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల ఫ్రెండ్‌షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ ఎవరి మాట పెద్దగా వినకపోయినా త్రివిక్రమ్ చెబితే మాత్రం కాదనడనే టాక్ ఉంది. అయితే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న పవన్.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు త్రివిక్రమ్‌కు చాలా విషయాల్లో ఒకే రకమైన అభిప్రాయాలంటాయన్న హీరో 'ఇద్దరం పుస్తకాల పురుగులమే.

ఏదైనా బుక్ చదవడం మొదలుపెడితే అది పూర్తయ్యేవరకు వదిలిపెట్టం. ఒకసారి నా దగ్గర ఉన్న పుస్తకాల్లో ఒకటి కావాలని ఆయన అడిగాడు. కావాలంటే ఒక సినిమా ఫ్రీగా చేస్తా ఆ బుక్ మాత్రం ఇవ్వనని చెప్పాను' అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే తన పిల్లలు త్రివిక్రమ్ బాటలోనే నడుస్తున్నారన్న పవన్.. తన కొడుకు అకిరా త్రివిక్రమ్ తనయుడు రిషి మనోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిపాడు.

Next Story