MIM Corporator: అర్థరాత్రి పాతబస్తీలో ఎంఐఎం కార్పొరేటర్ హల్ చల్

by samatah |   (  Updated:2022-04-07 05:25:21  IST  )

దిశ, వెబ్‌డెస్క్ : భోలక్ పూర్ కార్పొరేటర్ ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది.

MIM Corporator: అర్థరాత్రి పాతబస్తీలో ఎంఐఎం కార్పొరేటర్ హల్ చల్
X

దిశ, వెబ్‌డెస్క్ : భోలక్ పూర్ కార్పొరేటర్ ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. పాతబస్తీలో అర్థరాత్రి ఎంఐఎం కార్పొరేటర్ హల్ చల్ చేశారు. యూనాని ఆసుపత్రి ముందు నో పార్కింగ్‌లోవాహనాన్ని నిలిపారు. అయితే ఆ వాహనాన్ని తీయమన్నందుకు కార్పోరేటర్ అక్కడి సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో స్థానికులు ఎస్‌ఐకి సమాచారం అందిచడంతో హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరిన ఎస్‌ఐ సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. కానీ కార్పోరేటర్ ఇక్కడ ఇలాగే చేస్తామంటూ ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ కార్పోరేటర్ పోలీసులపై నిప్పులు చెరిగారు.

Next Story