దిశ ఎఫెక్ట్.. భారీ గుంత పూడ్చివేత

by Batti.Sumithra |   (  Updated:2026-07-25 10:36:28  IST  )

శుక్రవారం నాడు దిశలో ప్రచురితమైన రోడ్డు పక్కన భారీ గుంత అనే వార్తకు అధికారులు స్పందించారు.

దిశ ఎఫెక్ట్.. భారీ గుంత పూడ్చివేత
X

దిశ, నర్సాపూర్ : శుక్రవారం నాడు దిశలో ప్రచురితమైన రోడ్డు పక్కన భారీ గుంత అనే వార్తకు అధికారులు స్పందించారు. ఎంపీవో మహమ్మద్ మోజామ్ హుస్సేన్ వార్తకు స్పందించి గొల్లపల్లి గ్రామపంచాయతీ సిబ్బందికి గుంతను పూడ్చి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎంపీఓ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ సిబ్బంది గుంతను పూడ్చి వేశారు. అనంతరం శనివారం నాడు ఎంపీఓ గుంతను పూడ్చివేసిన స్థలాన్ని సిబ్బందితో కలిసి పరిశీలించారు. గుంతను పూడ్చివేయడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పిందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దిశకు ప్రయాణికులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.




Next Story