- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెలోనికి మోడీ 'మెలొడీ' చాక్లెట్ల బహుమతి.. కృతజ్ఞతలు తెలిపిన పార్లే సంస్థ
అంతర్జాతీయ దౌత్య వేదికపై భారత్ స్వదేశీ బ్రాండ్‌కు ఇంతటి అపూర్వ గౌరవం దక్కడం పట్ల ప్రధాని మోడీకి పార్లే సంస్థ కృతజ్ఞతలు తెలియజేసింది.

దిశ, వెబ్ డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఇటలీ రాజధాని రోమ్‌లో పర్యటిస్తున్నడు అత్యంత ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనితో జరిగిన అధికారిక భేటీ సందర్భంగా ప్రధాని మోడీ ఆమెకు భారతదేశపు ప్రసిద్ధ 'పార్లే మెలొడీ' (Parle Melody) టాఫీల ప్యాకెట్‌ను కానుకగా అందించారు. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను పీఎం మెలోని తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ, "ప్రధాని మోడీ మాకోసం ఒక అద్భుతమైన చాక్లెట్ కానుకను తీసుకువచ్చారు.. అదే మెలొడీ" అని పేర్కొంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ దౌత్య వేదికపై భారత్‌కు చెందిన ఒక స్వదేశీ బ్రాండ్‌కు ఇంతటి అపూర్వ గౌరవం దక్కడం పట్ల మెలొడీ చాక్లెట్ల తయారీ సంస్థ అయిన ‘పార్లే ప్రొడక్ట్స్’ (Parle Products) స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేసింది. "గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మా హృదయపూర్వక ధన్యవాదాలు.
పార్లే మెలొడీ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడం మా అందరికీ ఎంతో గర్వకారణం. భారతీయులు ఎంతో ఇష్టపడే ఒక స్వదేశీ ఉత్పత్తిని అంతర్జాతీయ సరిహద్దులు దాటించి, ప్రపంచ వేదికపై పంచుకోవడం పార్లే ప్రొడక్ట్స్ కుటుంబానికి ఒక మరపురాని మైలురాయి" అని ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళుతున్న "వోకల్ ఫర్ లోకల్" (Vocal for Local), "మేక్ ఇన్ ఇండియా" ఉద్యమాలకు ప్రధాని మోడీ చేసిన ఈ చిన్న కానుక ఒక గొప్ప గుర్తింపుగా నిలిచిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ బ్రాండ్ల సామర్థ్యానికి ఇది ఒక నిదర్శనమని పార్లే సంస్థ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా హర్షం వ్యక్తం చేశారు.






