పాకిస్థాన్‌లో చమురు మంటలు.. 200 శాతం పెరిగిన ధరలు

by Malleboina Mahesh |

యుద్ధం కారణంగా పాకిస్థాన్‌లో చమురు సంక్షోభం. పెట్రోల్ రూ. 321, డీజిల్ రూ. 335, గ్యాస్ సిలిండర్ రూ. 2664కు చేరింది. ప్రజల అల్లాడుతున్న పరిస్థితి.

పాకిస్థాన్‌లో చమురు మంటలు.. 200 శాతం పెరిగిన ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా 'హార్మూజ్ జలసంధి' (Strait of Hormuz) మూతపడటంతో చమురు దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌కు పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత దారుణమైన ఇంధన సంక్షోభంలో కూరుకుపోయింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా 'హార్మూజ్ జలసంధి' (Strait of Hormuz) మూతపడటంతో చమురు దిగుమతులు నిలిచిపోయాయి. దీని ప్రభావంతో పాక్ ప్రభుత్వం ఈ నెలలో చమురు ధరలను భారీగా పెంచింది. తాజాగా మార్చి మొదటి వారంలో లీటరుకు 55 రూపాయల మేర పెంచడంతో, ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 321.17కు, డీజిల్ ధర రూ. 335.86కు చేరుకుంది. పెరిగిన ధరలతో రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో సామాన్యులపై నిత్యావసరాల భారం రెట్టింపు అయ్యింది.

మరోవైపు వంట గ్యాస్ ధరలు కూడా పాకిస్తాన్ ప్రజలకు (people of Pakistan) చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌లో 11.8 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,664.88 వద్ద ఉంది. ఇంధన కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఇప్పటికే 'వర్క్ ఫ్రమ్ హోమ్', విద్యాసంస్థలకు సెలవులు వంటి పొదుపు చర్యలను ప్రకటించింది. విలాసవంతమైన వాహనాల్లో వాడే 'హై ఆక్టేన్' ఇంధనంపై లెవీని ఏకంగా 200 శాతం (లీటరుకు రూ. 300) పెంచడం గమనార్హం. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే పెట్రోల్ ధర లీటరుకు 500 రూపాయలు దాటే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story