భారత్ తో మ్యాచ్ కు పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

by Muthe.Rajitha |

టీ20 వరల్డ్ కప్ మెన్ టోర్నమెంటు అనేక మలుపులు తిరుగుతోంది.

భారత్ తో మ్యాచ్ కు పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్ కప్ మెన్ టోర్నమెంటు అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా టీంఇండియాతో పాక్జట్టు మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. సోమవారం రాత్రి ఐసీసీ, పీసీబీ, బీసీబీ, శ్రీలంక క్రికెట్ బోర్డుల సమావేశం అనంతరం.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆ దేశ ప్రధానితో విడిగా చర్చలు జరిపి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కాగా కొద్దిసేపటి క్రితమే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, శ్రీలంక క్రికెట్ బోర్డులు భారత్ తో ఈనెల 15న జరిగే మ్యాచ్ ఆడాలని విజ్ఞప్తి చేసిన కొద్ది గంటల్లోనే ఈ ప్రకటన రావడం గమనార్హం. దీంతో 15న జరగనున్న మ్యాచ్ యథాతథంగా జరుగుతుందని ఐసీసీ పేర్కొంది.

కాగా దాయాది దేశాల మధ్య పోరుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ తిలకించనున్నారు. అయితే భారత్ లో తాము మ్యాచులు ఆడబోమని, వేదికలు మార్చాలని బంగ్లా క్రికెట్ బోర్డు ఐసీసీ ని కోరగా.. అందుకు ఐసీసీ తిరస్కరించింది. దీంతో తాము టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనడం లేదని ప్రకటించింది. అయితే తాము బంగ్లాదేశ్ కు మద్దతు ఇస్తున్నామని, తాము కూడా భారత్ తో జరిగే మ్యాచులు ఆడబోమని పాక్ క్రికెట్ బోర్డు పేర్కొంది. అందుకు అనుగుణంగానే ఇటీవల భారత్-పాక్ మ్యాచ్ ను పాక్ బాయ్ కాట్ చేసింది.

Next Story