- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పహాల్గమ్ పర్యాటక కేంద్రాలు రీ ఓపెన్
ఉగ్రదాడి తర్వాత పహాల్గమ్ లోని పలు పర్యాటక కేంద్రాలు రీ ఓపెన్ చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సోమవారం పహాల్గమ్ సహా మరికొన్ని పర్యాటక ప్రాంతాలను రీ ఓపెన్ చేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 22, 2025న పహల్గామ్‌లోని బైసరన్ మేడోలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 26 మంది మరణించగా.. వీరిలో ఎక్కువమంది పర్యాటకులే. ఈ ఘటన తర్వాత సుమారు 48 నుంచి 50 టూరిస్టు ప్రదేశాలను ముందు జాగ్రత్త చర్యగా మూసివేశారు. అప్పటి నుంచి దశలవారీగా కొన్ని ప్రాంతాలను తిరిగి ప్రారంభిస్తూ వస్తున్నారు. తర్వాత భద్రతా కారణాలతో తాత్కాలికంగా మూసివేసిన పలు టూరిస్టు ప్రాంతాలను మళ్లీ తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 14 టూరిస్టు స్పాట్లను తక్షణ ప్రభావంతో పునఃప్రారంభిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఇప్పటివరకు మొత్తం 34 ప్రదేశాలు తిరిగి తెరుచుకున్నాయి.
కాగా ఈరోజు రీ-ఓపెన్ అయిన ప్రదేశాల్లో కశ్మీర్లోని యూస్మార్గ్, దూధ్‌పత్రి (బుడ్గామ్), దండిపోరా పార్క్ (కొకర్‌నాగ్), పీర్ కి గలి, డుబ్జన్, పడ్పావన్ (షోపియన్), ఆస్తాన్పోరా, శ్రీనగర్‌లోని ట్యూలిప్ గార్డెన్, తజ్వాస్ గ్లేసియర్, హంగ్ పార్క్ (గందర్‌బల్), వాట్లాబ్ (బారాముల్లా) ఉన్నాయి. జమ్మూ డివిజన్‌లో దేవి పిండి (రియాసి), మహు మంగట్ (రంబన్), మొఘల్ మైదాన్ (కిష్త్వార్) ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ తక్షణమే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అదనంగా గురెజ్, అథ్వాటూ, బంగస్ (కాశ్మీర్), రామ్‌కుండ్ (రంబన్) ప్రాంతాలను మంచు తొలగించిన తర్వాత త్వరలో ప్రారంభించనున్నారు. భద్రతా పరిస్థితులపై సమగ్ర సమీక్ష జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా జమ్మూకశ్మీర్లో టూరిజం రంగానికి, స్థానికుల జీవనోపాధికి ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం అని అధికారులు తెలిపారు.






