దిగ్గజ కమ్యూనిస్టు నేతకు, నటుడు మెగాస్టార్‌కు కేంద్రం పురస్కారం

by Gantepaka Srikanth |

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించింది.

దిగ్గజ కమ్యూనిస్టు నేతకు, నటుడు మెగాస్టార్‌కు కేంద్రం పురస్కారం
X

దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు(Padma Awards) ప్రకటించింది. కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌కు పద్మవిభూషణ్‌, మలయాళ దిగ్గజ నటుడు మెగాస్టార్ మమ్ముట్టికి పద్మభూషణ్ అవార్డుతో కేంద్రం సత్కరించింది. గతేడాదితో పోల్చితే ఈసారి పద్మశ్రీ అవార్డులను కేంద్రం సగానికిపైగా తగ్గించింది. అవార్డు విజేతల్లో అత్యంత ప్రముఖులతో పాటు అంత్యంత మారుమూల, వెనుకబడిన ప్రాంతాలు సహా వివిధ ప్రాంతాలకు చెందినవారు కూడా ఉండటం గమనార్హం. ఆరోగ్య సంరక్షణ, విద్య, జీవనోపాధి కల్పన, పారిశుద్ధ్యం, పర్యావరణ స్థిరత్వం, సాంప్రదాయ కళలు, వారసత్వ పరిరక్షణ వంటి రంగాల్లో సేవలు అందించిన వారిని గుర్తించి అవార్డులు ప్రకటించారు. అర్థవంతమైన సామాజిక ప్రభావాన్ని చూపిన వ్యక్తులను గుర్తించడానికి ఈ అవార్డులు తోడ్పడతాయి. రేపు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు.

Next Story