- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా, యూరోపియన్ మార్కెట్లకు వన్‌ప్లస్ గుడ్‌బై!
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వన్‌ప్లస్ బ్రాండ్ అమెరికా, యూరప్ మార్కెట్ల నుండి మొబైల్ విక్రయాలను పూర్తిగా నిలిపివేయడానికి సిద్ధమవుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు "ఫ్లాగ్‌షిప్ కిల్లర్" (Flagship Killer)గా మార్కెట్లోకి అడుగుపెట్టి, సగం ధరకే ప్రీమియం ఫీచర్లను అందిస్తూ గ్లోబల్ మొబైల్ రంగంలో సంచలనం సృష్టించిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'వన్‌ప్లస్' (OnePlus) తన సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించే దిశగా అడుగులు వేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వన్‌ప్లస్ బ్రాండ్ అమెరికా, యూరప్ మార్కెట్ల నుండి మొబైల్ విక్రయాలను పూర్తిగా నిలిపివేయడానికి సిద్ధమవుతోంది. జర్మనీకి చెందిన ప్రముఖ మీడియా సంస్థ 'విన్‌ఫ్యూచర్' (WinFuture) కథనం ప్రకారం.. వన్‌ప్లస్, దాని మాతృ సంస్థ 'ఒప్పో'(Oppo) తమ వ్యాపార వ్యూహంలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు పశ్చిమ దేశాల మార్కెట్ల నుండి వన్‌ప్లస్ బ్రాండ్ పూర్తిగా నిష్క్రమించబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి రహస్య ప్రెస్ మీటింగ్‌లు కూడా పూర్తయ్యాయని, అయితే ఈ నిర్ణయం వెనుక గల ఖచ్చితమైన కారణాలను వెల్లడించడానికి కంపెనీ ప్రతినిధులు నిరాకరించినట్లు సమాచారం.
భారత్, చైనా మార్కెట్లలో యథాతదం
ఈ నిష్క్రమణ వార్తల్లో భారత్, చైనా మార్కెట్ల ప్రస్తావన ఎక్కడా రాలేదు. ఒప్పో(Oppo) గొడుగు కింద వన్‌ప్లస్ బ్రాండ్ కేవలం ఒక సబ్-ప్రొడక్ట్ లైన్‌గా మాత్రమే ఈ రెండు దేశాల్లో కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అంటే తక్కువ బడ్జెట్ ఫోన్లు, టాబ్లెట్‌ల విక్రయాలకే పరిమితం కానుందని సమాచారం. నిజానికి వన్‌ప్లస్ బ్రాండ్ ఇప్పటికీ మనుగడ సాగించడానికి ప్రధాన కారణం భారతదేశమే. వన్‌ప్లస్ గ్లోబల్ సేల్స్‌లో సగానికి పైగా వాటా భారత్ నుంచే వస్తోంది. ముఖ్యంగా ఇక్కడి మిడ్-రేంజ్ మార్కెట్లో వన్‌ప్లస్ 'నార్డ్' (Nord) సిరీస్ ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది.
పాత ఫోన్ల యూజర్ల పరిస్థితి ఏంటి?
అయితే, ఇప్పటికే వన్‌ప్లస్ ఫోన్లు వాడుతున్న కస్టమర్ల విషయంలో కంపెనీ సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మరియు ఇప్పటికే విక్రయించిన డివైజ్‌లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాకపోతే.. ఇకపై కొత్త ఫోన్ల లాంచ్ ఉండదు, కొత్త స్టాక్ రాదు, ఎలాంటి మార్కెటింగ్ ప్రచారాలు జరగవు. ప్రస్తుతం అమెరికా, యూరప్‌లలో మిగిలి ఉన్న స్టాక్‌ను రాబోయే కొద్ది వారాల్లో విక్రయించి క్లియర్ చేయనున్నారు. ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లోని వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్స్ దాదాపు ఖాళీ అయ్యాయి.
యూరప్ మార్కెట్లో వన్‌ప్లస్ వదిలిన స్థానాన్ని ఒప్పో భర్తీ చేయాలని చూస్తోంది. కానీ, ఒప్పో ఫోన్ల ధరలు వన్‌ప్లస్ కంటే చాలా ఎక్కువ. ఒక వాల్యూ-ఫర్-మనీ బ్రాండ్ స్థానాన్ని ప్రీమియం బ్రాండ్‌తో భర్తీ చేయాలనుకోవడం పెద్ద మైనస్ అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒప్పో నుండి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ.. ఇటీవల విడుదలైన 'వన్‌ప్లస్ 15' (OnePlus 15) పాశ్చాత్య దేశాలలో ఈ బ్రాండ్ నుండి వచ్చిన చివరి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా మిగిలిపోనుంది.






