- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఒకరు మృతి ..ఆందోళనకు దిగిన తండావాసులు
by Manoj |
దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు..latest telugu news

X
దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని క్యాసంపల్లి తండాకు చెందిన విస్లావత్ జెత్య(55) ఎక్సెల్ పై గ్రామానికి వెళ్తుండగా గ్రామ శివారులోని గురు రాఘవేంద్ర రైస్ మిల్ కు చెందిన లారీ ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే విస్లావత్ జెత్య మృతికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ తండావాసులు రైస్ మిల్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






