- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాహనదారులకు బిగ్ షాక్.. రెండ్రోజుల్లో రెండోసారి పెరిగిన ధరలు
దేశ రాజధానిలో సీఎన్‌జీ ధరలు మరో రూపాయి పెరిగాయి. ఢిల్లీలో కిలో సీఎన్‌జీ రూ. 80.09 కాగా, నోయిడాలో రూ. 88.70 కి చేరింది. రెండు రోజుల్లో ఇది రెండోసారి.

దిశ, వెబ్ డెస్క్: భారత రాజధాని నగరం అయిన ఢిల్లీలో సీఎన్జీ వాహనదారులకు (CNG vehicle owners) మరో షాక్ తగిలింది. ఆదివారం చమురు కంపెనీలు ధరలు పెంచి షాక్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న సామాన్యులపై నిరంతరాయంగా సీఎన్‌జీ (CNG) భారం కూడా పడుతోంది. తాజాగా సీఎన్‌జీ ధరలను కిలోకు మరో రూపాయి (1) పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ నూతన ధరలు ఈరోజు (మే 17, 2026) నుంచే అమల్లోకి వచ్చాయి. గడిచిన రెండు రోజుల్లోనే సీఎన్‌జీ ధరలు పెరగడం ఇది రెండోసారి. అంతకుముందు మే 15వ తేదీన కూడా చమురు కంపెనీలు సీఎన్‌జీ ధరను కిలోకు ఏకంగా రూ. 2 మేర పెంచాయి. తాజా పెంపుతో ఢిల్లీ, చుట్టుపక్కల నగరాల్లో రేట్లు గరిష్ట స్థాయికి చేరాయి.
తాజా పెంపు తర్వాత ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ. 80.09 కి చేరింది. నోయిడా - ఘాజియాబాద్ (Noida-Ghaziabad): ఉత్తరప్రదేశ్ పరిధిలోని నోయిడా, ఘాజియాబాద్‌లలో కిలో సీఎన్‌జీ ధర రూ. 88.70 పలుకుతోంది. రెండు రోజుల్లోనే మొత్తం రూ. 3 మేర భారం పడటం తో ఆటో, క్యాబ్ డ్రైవర్లతో పాటు సాధారణ వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరల పెరుగుదల రవాణా రంగంపై ప్రభావం చూపి, పరోక్షంగా నిత్యావసరాల ధరల పెరుగుదలకు దారితీస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.






