- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వం మా మీద అక్రమ కేసులు పెట్టింది : జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్
తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా పోలీసులు అరెస్టు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీవీ జర్నలిస్టుల రిమాండ్ రిక్వెస్ట్ రిజెక్ట్ చేసిన కోర్ట్.. వారికి బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బయటికి వచ్చిన జర్నలిస్టులు మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా పోలీసులు అరెస్టు చేశారని ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో న్యాయం గెలిచిందని చెప్పిన ఆయన.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి యూట్యూబ్ జర్నలిస్టుల అరెస్టులు జరిగినా, వర్కింగ్ జర్నలిస్టులను ఇలా అరెస్టు చేసిన దాఖలాలు లేవని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాము చేయని తప్పుకు అరెస్టు చేసి తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందని ఆరోపించారు.
తమపై సిట్‌ను నియమించడం ఆశ్చర్యంగా ఉందని, ఇది ఏమైనా అంతర్జాతీయ నేరమా లేదా ఉగ్రవాదానికి సంబంధించిన కేసా అని ప్రశ్నించారు. తమపై ఏ సెక్షన్లు పెట్టారో, ఎప్పుడు పెట్టారో కూడా తమకు తెలియకుండా కేసులు నమోదు చేశారని దొంతు రమేష్ చెప్పారు. మరో జర్నలిస్ట్ సుధీర్ మాట్లాడుతూ.. తమకు ఎలాంటి సంబంధం లేని కేసులో పోలీసులు అక్రమంగా, అన్యాయంగా తమపై కేసు పెట్టి వేధించారని అన్నారు. పోలీసులు ముందే ప్రీ ప్లాన్‌తో ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని దాని ప్రకారమే విచారణలో ప్రశ్నలు అడిగారని ఆరోపించారు.
ప్రజలకు ఇబ్బంది కలిగేలా లేదా తప్పుదారి పట్టించేలా తాము ఎక్కడా వార్తలు ప్రసారం చేయలేదని స్పష్టం చేశారు. కాగా ఇటీవల రాష్ట్ర మంత్రికి ఓ ఐఏఎస్ అధికారిణికి సంబంధం ఉందంటూ ఎన్టీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం.. సదరు టీవీ ఛానెల్ జర్నలిస్టులను అరెస్ట్ చేసింది. మరికొంతమందిని విచారించి, వదిలేసింది.






