- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lakshmi Pranathi: ఎన్టీఆర్ సతీమణి ఫేవరెట్ మూవీ.. పాన్ ఇండియా హీరో ఎవరంటే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR) సతీమణి లక్ష్మి ప్రణతి(Lakshmi Pranathi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR) సతీమణి లక్ష్మి ప్రణతి(Lakshmi Pranathi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె సినిమాలతో సంబంధం లేకుండా కేవలం ఫ్యామిలీ బాధ్యలను చూసుకుంటుంది. ఇప్పటివరకు లక్ష్మి ప్రణతి ఏ సినిమాల్లో కనిపించింది లేదు. కానీ ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ హీరో, హీరోయిన్ అని ఉంటారు.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ సతీమణికి ఓ పాన్ ఇండియా హీరో అంటే ఇష్టమంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈమెకు తెలుగులో ఓ స్టార్ హీరో మూవీలంటే ఇష్టమట. మరీ ఆ హీరో ఎవరని ఆలోచిస్తున్నారా..? తారక్ బెస్ట్ ఫ్రెండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global star Ram Charan). ఈ మెగా హీరో లక్ష్మి ప్రణతికి ఫేవరెట్ అట. మ్యారేజ్ ముందు చరణ్ చిత్రాలను ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూసేదని టాక్.
రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం మగధీర (Magadhira) అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అట. ఈ మూవీ చాలా టైమ్స్ చూసిందట. ఇకపోతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషనల్‌లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఆస్కార్ ను కూడా తీసుకొచ్చింది.
ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ నటించిన చివరి సినిమా దేవర(Devara) కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. కొరటాల శివ (Koratala Shiva)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో జాన్వీకపూర్(Janhvi Kapoor) కథానాయికగా నటించి మెప్పించింది. ఈ అమ్మడుకు తెలుగులో మొదటి సినిమా ఇదే. తొలి సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది.






