- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభిమానులకు మాటిస్తున్నా.. JR.NTR స్పెషల్ నోట్ వైరల్
దిశ, సినిమా : యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఆర్‌ఆర్ఆర్' చిత్రాన్ని ఉద్ధేశిస్తూ స్పెషల్‌గా థ్యాంక్స్ నోట్ షేర్ చేశాడు. latest telugu news..

దిశ, సినిమా : యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఆర్‌ఆర్ఆర్' చిత్రాన్ని ఉద్ధేశిస్తూ స్పెషల్‌గా థ్యాంక్స్ నోట్ షేర్ చేశాడు. ఈ భారీ యాక్షన్ డ్రామాలో భీమ్‌గా నటించిన తారక్.. సినిమా ఘన విజయం సాధించడంలో తమ వంతు పాత్ర పోషించిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, కో యాక్టర్స్, నిర్మాతలు, టెక్నీషియన్లు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. మున్ముందు మరెన్నో మంచి సినిమాలతో అలరిస్తానని అభిమానులకు వాగ్ధానం చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే 'ఆర్‌ఆర్‌ఆర్'లో ఎన్టీఆర్ కన్నా రామ్ చరణ్‌కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారని సోషల్ మీడియాలో రూమర్స్ వ్యాపించగా.. అందుకే ఎన్టీఆర్ 'సక్సెస్' పార్టీకి హాజరు కాలేదన్న గుసగుసలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒక్కపోస్ట్‌తో వాటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టిన హీరో.. చిత్రబృందానికి, ఫ్యాన్స్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ సుదీర్ఘ నోట్ విడుదల చేయడం విశేషం. ప్రస్తుతం ఈ నోట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.






