- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cooking Tips: ఆకుకూరల్లో పసుపు ఎందుకు వేయొద్దు.. అసలు కారణమిదే..?
పసుపు (Pasupu)ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు(Anti-inflammatory properties) పుష్కలంగా ఉంటాయి.

దిశ, వెబ్‌డెస్క్: పసుపు (Pasupu)ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు(Anti-inflammatory properties) పుష్కలంగా ఉంటాయి. తద్వారా చర్మ ఆరోగ్యం, జీర్ణక్రియ (digestion), రోగనిరోధక శక్తి (Immunity), ఎముకల ఆరోగ్యం (Bone health) మెరుగుపడుతుందని నిపుణులు చెబుతుంటారు. పసుపు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల్ని కలిగి ఉంటుంది. కాగా ఫేస్ పై పింపుల్స్, తామర, సోరియాసిస్ వంటి చర్మ పరిస్థితులు దూరం అవుతాయి.
అంతేకాకుండా పసుపు బోన్ హెల్త్ (Bone Health) ను కూడా బాగు చేస్తుంది. పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు బోలు ఎముకల వ్యాధి వంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులను నివారించడంలో మేలు చేస్తుంది. పసుపులో జీర్ణక్రియ(digestion)ను పెంచే సామర్థ్యం ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచి, మెదడు పనితీరును, గుండె ఆరోగ్యాన్ని (heart health)మెరుగుపరుస్తుంది.
కొలెస్ట్రాల్ లెవల్స్ (Cholesterol levels)ను, రక్త నాళాలలో మంటను తగ్గిస్తుంది. ఎండోథెలియల్ (Endothelial) పనితీరును మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యం (Heart health) బాగుంటుంది. అయితే సాధారణంగా ఆకు కూరల్లో పసుపు వేయరు మరీ ఎందుకు వేయొద్దో నిపుణులు చెప్పిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆకు కూరల్లో పసుపు వేయడం ద్వారా టేస్ట్ మారిపోతుందట. అలాగే కూరల్లోని పోషకాలు కూడా తగ్గుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా మెంతికూర (fenugreek)లో అస్సలు పసుపు వేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మెంతి కూరనే చేదుగా ఉంటుంది. పైగా పసుపు యాడ్ చేస్తే ఇంకా కూర చేదుగా మారిపోతుంది.తద్వారా తినడానికి బాగుండదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.






