బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు.. ఎన్నికల వేళ TVK సంచలన ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-14 05:45:05  IST  )

ఎన్నికల వేళ తమిళనాడు (Tamilnadu) పాలిటిక్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు.. ఎన్నికల వేళ TVK సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ తమిళనాడు (Tamilnadu) పాలిటిక్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు దళపతి విజయ్ (Thalapathy) నేతృత్వంలోని తమిళ వెట్రి కజగం (TVK) పార్టీ తన రాజకీయ వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో (BJP) పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ (Nirmal Kumar) తేల్చి చెప్పారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ కార్యకలాపాలను, తమ ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. తమ పార్టీ ఒక బలమైన సైద్ధాంతిక పునాదిపై ఏర్పడిందని కామెంట్ చేశారు. బీజేపీతో మాకు ఎటువంటి సైద్ధాంతిక పొంతన లేదని.. కాబట్టి ఆ పార్టీతో కలిసే అవకాశమే లేదని పేర్కొన్నారు. తమ పార్టీ సొంత అస్తిత్వంతోనే టీవీకే ప్రజల్లోకి వెళ్తుందని తెలిపారు. ఇక ‘జననాయగన్‌’ ఎదుర్కొంటున్న సెన్సార్ వివాదంపై విజయ్‌కు మద్దతుగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని అన్నారు. భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటున్న తరుణంలో రాహుల్ గాంధీ మద్దతు తమకు ఎంతో బలాన్ని ఇచ్చిందని టీవీకే ప్రార్టీ వర్గాలు తెలిపాయి.

Next Story