ఇక మెట్రోలో అలా చేసినా నో పెనాల్టీ.. చెప్పిన అధికారులు..

by Dishafeatures2 |
ఇక మెట్రోలో అలా చేసినా నో పెనాల్టీ.. చెప్పిన అధికారులు..
X

దిశ, వెబ్‌డెస్క్: మెట్రో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తున్న ప్రయాణ సాధనాల్లో ఒకటి. గమ్య స్థానాలకు తక్కువ సమయంలో వెళ్లేందుకు అందరూ మెట్రోనే ఎంచుకుంటున్నారు. కానీ కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి మెట్రోలో మాస్క్ ధరించకపోతే పెనాల్టీ పడుతుంది. అయితే తాజాగా ఇకపై మెట్రోలో మాస్క్ ధరించకపోయినా పెనాల్టీ పడదంటూ అధికారులు తెలిపారు. 'మెట్రోలో ప్రయాణించే వారు ఎవరైనా ఇకపై మాస్క్ ధరించకపోయినా వారిపై ఎటువంటి జరిమానా వేయబడదు' అంటూ ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఆదివారం ప్రకటించింది. 'ఢిల్లీ విపత్తు నిర్వహణా శాఖ గైడ్‌లైన్స్ ప్రకారం మెట్రోలో మాస్క్, శానిటైజర్ తప్పనిసరి కదా' అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు డీఎంఆర్‌సీ అధికారులు తెలిపారు.



Next Story