- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిజాస్టర్స్‌తో సంబంధం లేకుండా కెరీర్‌లో దూసుకుపోతున్న భామ
by Chukka Sudharani |
దిశ, సినిమా: బ్యూటిఫుల్ తాప్సీ జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్‌లో దూసుకెళ్తోంది.

X
దిశ, సినిమా: బ్యూటిఫుల్ తాప్సీ జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్‌లో దూసుకెళ్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఎంచుకుంటున్న తాప్సీ.. తన నటనతో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తోంది. 'థప్పడ్', 'పింక్' మూవీస్ నుంచి ఇటీవల రిలీజైన 'శభాష్ మిథు' వరకు దాదాపు అన్నీ ప్రయోగాత్మక చిత్రాలే. అయితే ఈ మధ్య 'హసీన్ దిల్ రుబా', 'రష్మీ రాకెట్', 'మిషన్ ఇంపాజిబుల్' లాంటి చిత్రాలు ఓటీటీలో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకున్నా సరే సందేశాత్మకంగా ఉంటున్నాయి. అందుకే తాప్సీ సినిమాలు డిజాస్టర్ అయినా సరే మేకర్స్ ప్రత్యేకంగా తన గురించి స్క్రిప్ట్ సిద్ధం చేస్తుండటం విశేషం. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సొట్ట బుగ్గల సుందరి చేతిలో ఏకంగా ఏడు సినిమాలు ఉండటం గమనార్హం. ఇక ఇప్పటికే నిర్మాతగా మారిన తాప్సీ.. సమంత ప్రధాన పాత్రలో ఓ సినిమా కూడా రూపొందించబోతోంది.
Next Story






