రిపబ్లిక్ పరేడ్‌లో తెలుగు రాష్ట్రాల శకటాలకు నో ఛాన్స్

by Muthe.Rajitha |

దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ పరేడ్‌లో ఈసారి ఇరు తెలుగు రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు అవకాశం దక్కలేదు.

రిపబ్లిక్ పరేడ్‌లో తెలుగు రాష్ట్రాల శకటాలకు నో ఛాన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ పరేడ్‌లో ఈసారి ఇరు తెలుగు రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు అవకాశం దక్కలేదు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న రొటేషన్ పాలసీ కారణంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు మినహాయించబడ్డాయి. కర్తవ్య పథ్‌లో ఈసారి మొత్తం 30 శకటాలు మాత్రమే ప్రదర్శించనుండగా.. అందులో 17 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలుఉండగా.. మరో 13 కేంద్ర శాఖల శకటాలు ఉంటాయి. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రొటేషన్ విధానం అమలు చేస్తున్నారు.

2024–2026 రొటేషన్ సైకిల్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, గోవా, ఝార్ఖండ్, ఢిల్లీ, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు కూడా ఎంపిక కాలేదు. తెలుగు రాష్ట్రాల శకటాలు పరేడ్‌లో లేకపోయినా, భారత్ పర్వ్ కార్యక్రమంలో ఎర్రకోట వద్ద ప్రదర్శించే అవకాశం ఉంది. రొటేషన్ కారణంగానే ఈ మినహాయింపు జరిగిందని, 2027 తర్వాత మళ్లీ అవకాశం వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

Next Story