నిజామాబాద్ పేరు మారుస్తాం.. MP అర్వింద్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ కీలక నేత, ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

నిజామాబాద్ పేరు మారుస్తాం.. MP అర్వింద్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల(Municipal Elections) వేళ తెలంగాణ బీజేపీ కీలక నేత, ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగరేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాకు నిజామాబాద్ అనే పేరు అపశకునం లాగా మారింది. బీజేపీ వ్యక్తి మేయర్ అయిన వెంటనే నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని కీలక ప్రకటన చేశారు. మేయర్ మొదటి తీర్మానం నిజామాబాద్ పేరు మీదే ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో ఇందూరుగా ఉన్న పేరును నిజాం కాలంలో నిజామాబాద్‌గా మార్చారని గుర్తుచేశారు. ఘనమైన చరిత్ర ఉన్న ఇందూరుకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. మరోవైపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్ర రావు స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థులు అన్ని మున్సిపాలిటీల్లో స్వతంత్రంగా పోటీ చేస్తారన్నారు. అత్యధికంగా తమ పార్టీ మున్సిపల్ స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ వార్డు సభ్యుల ఎన్నిక కోసం రాష్ట్రస్థాయిలో కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

Next Story