నితీష్ కుమార్ రాజ్యసభ‌కు వెళ్లడం కేవలం పుకార్లే: ఎంపీ అరుణ్ భారతి

by Malleboina Mahesh |   (  Updated:2026-03-05 14:59:54  IST  )

బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నారనేవి కేవలం పుకార్లేనని, ఆయనే బీహార్ సీఎం గా కొనసాగుతారని ఎల్జేపీ (రామవిలాస్) ఎంపీ అరుణ్ భారతి స్పష్టం చేశారు.

నితీష్ కుమార్ రాజ్యసభ‌కు వెళ్లడం కేవలం పుకార్లే: ఎంపీ అరుణ్ భారతి
X

దిశ, వెబ్ డెస్క్: సుదీర్ఘ కాలంగా బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నితీష్ కుమార్ (Nitish Kumar) రాజ్య సభ (Rajya Sabha)కు వెళ్లనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి కుమారుడికి డిప్యూటీ సీఎం, బీజేపీకీ సీఎం పదవి ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఎల్జేపీ (రామ్ విలాస్) ఎంపీ అరుణ్ భారతి స్పందిస్తూ.. నితీష్ కుమార్ రాజ్యసభ కు వెళ్లడం కేవలం పుకార్లేనని కొట్టి పారేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఆయన రాజ్యసభకు వెళ్తున్నారనే అంశంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇవన్నీ కేవలం పుకార్లని, అధికారిక ధృవీకరణ వచ్చే వరకు ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారని అరుణ్ భారతి పేర్కొన్నారు.

ఇదే క్రమంలో నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం (Nishant Kumar's political debut)పై వస్తున్న వార్తలను ఆయన స్వాగతించారు. బీహార్‌ను 'జంగిల్ రాజ్' నుండి బయటపడేసిన తన తండ్రి వారసత్వాన్ని నిశాంత్ ముందుకు తీసుకెళ్తారని, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తారని తామంతా ఆశిస్తున్నామని తెలిపారు. ఇక రాజ్యసభ సీట్ల కేటాయింపుపై స్పందిస్తూ, తమ పార్టీకి ప్రస్తుతం తగిన సంఖ్యా బలం లేదని, తాము ఎప్పుడూ రాజ్యసభ సీటును కోరలేదని అరుణ్ భారతి మీడియాకు స్పష్టం చేశారు.

రాజ్యసభకు వెళ్లాలనేది నా కోరిక.. సీఎం నితీష్ కుమార్ సంచలన ప్రకటన

Next Story