కాసేపట్లో పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-29 07:26:38  IST  )

కేంద్ర బడ్జెట్ 2026-27 వార్షిక బడ్జెట్ సమావేశాల వేళ ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంటులో ఆర్థిక సర్వే 2025-26ను ప్రవేశపెట్టనున్నారు.

కాసేపట్లో పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
X

దిశ, వెబ్‌డెస్క్: 2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్ సమావేశాల వేళ ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంటులో ఆర్థిక సర్వే 2025-26ను ప్రవేశపెట్టనున్నారు. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబించే ఈ నివేదికను ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి.అనంత నాగేశ్వరన్ (V.Anantha Nageswaran) నేతృత్వంలో రూపొందించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత జీడీపీ వృద్ధి 6.3 శాతం నుంచి 7.2 శాతం మధ్య ఉండవచ్చని సర్వే అంచనా వేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి మధ్య భారతదేశం స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తోందని సూచిస్తుంది. రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పడుతోందని, ఇది 4 శాతం టార్గెట్‌కు చేరువవుతుందని సర్వే పేర్కొంది. ముఖ్యంగా ఆహార ధరలు అదుపులోకి రావడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశమని ఆర్థిక నిపణులు అంచనా వేస్తున్నారు. మెరుగైన రుతుపవనాల వల్ల వ్యవసాయ వృద్ధి రేటు ఆశాజనకంగా ఉందని, రబీ పంట దిగుబడి పెరగడం వల్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని సర్వే తెలిపింది.

2030 నాటికి దేశంలో ఏటా దాదాపు 78.5 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన అవసరమని, దీని కోసం తయారీ రంగం (Manufacturing)పై ప్రత్యేక దృష్టి సారించాలని సర్వే సూచించింది. 2047 నాటికి వికసిత్ భారత్ (Vikasit Bharat) లక్ష్యాన్ని చేరుకోవాలంటే, వచ్చే రెండు దశాబ్దాల పాటు నిలకడగా 8 శాతం వృద్ధి రేటును సాధించాల్సిన అవసరం ఉంది. కృత్రిమ మేధ (AI), రోబోటిక్స్, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు పెరగాలని సర్వే నొక్కి చెప్పింది. గత ఐదేళ్లలో నేషనల్ హైవేలు, రైల్వే నెట్‌వర్క్ విస్తరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయమైన ప్రగతి నమోదైందని నిర్మలా ఆర్థిక సర్వే బహర్గతం చేసింది.

Next Story